నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహశీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, సమానత్వం, దోపిడీ నివారణ, మత స్వాతంత్య్రం, రాజ్యాంగ పరిహారం, ఆస్తి హక్కులు వంటి పౌర హక్కులపై అవగాహన ఉండాలన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం–1989 గురించి వివరించారు.