మెదక్ జిల్లా రామాయంపేటలో బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం గురువారం మాట్లాడుతూ 2027 మార్చిలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలకు కేటాయిస్తే బీసీలను అవమానించినట్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులపై పునరాలోచించి కనీసం ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.