రామాయంపేట బస్టాండ్‌లో వెండి కడియాల చోరీ కలకలం

రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చిన్నారుల వెండి కడియాలు దొంగిలించినట్లు అనుమానించిన ఓ మహిళను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బస్సు ఎక్కే సమయంలో చిన్నారుల కాళ్లలో ఉన్న కడియాలు మాయమైనట్లు గుర్తించిన ప్రయాణికులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్