నిజాంపేటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నిజాంపేట మండల కేంద్రంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగు స్వామి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెదక్‌లో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా రజక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕