మెదక్ జిల్లా, నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో శనివారం పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అణగారిన వర్గాల హక్కులు, భూమి, భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని సర్పంచ్ మల్లేశం అన్నారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ రమేష్, రజకులు పాల్గొన్నారు.