చిన్నశంకరంపేట: పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం.. గ్రామ ప్రజలకు అవస్థలు

చిన్నశంకరంపేట మండలంలోని కొర్విపల్లి తండా గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసనతో పాటు మలేరియా, డెంగ్యూ రోగాల భయం పెరిగిందని తెలిపారు. వీధి దీపాలు పనికిరాకపోవడం, పాఠశాల మోటార్ మరమ్మతు చేయకపోవడం, నీటి లోపం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్