టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ రాంబాయిపై బంజారా సేవాలాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంపీడీవో రియాజుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ రాంబాయి బీసీ మహిళగా ఉండి, ఎస్టీ రిజర్వేషన్ పత్రాన్ని పొందడం ద్వారా ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్ పత్రాన్ని ఉపయోగించుకొని గతంలో ఎంపీటీసీగా గెలుపొందిన రాంబాయి, ప్రస్తుతం సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యారని తెలిపారు.