అల్పాహారంపై కాంగ్రెస్‌ నేతల హర్షం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహార పథకంపై నిజాంపేట మండల కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భాను ప్రకాష్‌రెడ్డి అన్నారు. మండలంలోని 16 గ్రామపంచాయతీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పథకం అమలవుతోందని, పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఆయనతో చల్మెడ సర్పంచ్ మల్లేశం, మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్, కొమ్మట బాబు, మధు లింగం గౌడ్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕