మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ లో ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఎరువుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పుష్కలంగా యూరియా, ఇతర ఫెర్టిలైజర్స్ ఉన్నాయన్నారు. ఎక్కడ కొరత లేదని తెలిపారు. జిల్లా మొత్తంలో 4675. 89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నట్లు కలెక్టర్ తెలిపారు. వ్యసాయ సిబ్బందితో ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.