నిజాంపేటలో బుధవారం రేషన్ దుకాణాలలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు గుమిగూడారు. సర్వర్ సమస్యల కారణంగా వేలిముద్రలు సరిగా పడక, బియ్యం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి వేలిముద్రలు రాకపోవడంతో పంపిణీ ప్రక్రియ ఆలస్యమైంది.