చిన్నశంకరంపేట ఎస్సై శివానందం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి ప్రాంతాల్లో పిడుగు పడే ప్రమాదంతో పాటు విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.