కాలం చెల్లిన మందులపై రైతుల ఆవేదన

నిజాంపేట మండల కేంద్రంలోని పశువైద్యశాల ముందు బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. వెటర్నరీ డాక్టర్ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో పశువులకు సరైన చికిత్స అందడం లేదని, కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని, దీంతో పశువులు మృతి చెందుతున్నాయని రైతులు ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్