ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రహదారిపై రైతుల నిరసన

సిద్దిపేట–తొగుట ప్రధాన రహదారిపై ఎన్సన్పల్లి వద్ద రైతులు, ప్రజా ప్రతినిధులు కలిసి ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న అనిశ్చితిపై నిరసన తెలిపారు. అధికారులు వడ్లు కొనలేమని చేతులెత్తేయడంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డెక్కి, అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

సంబంధిత పోస్ట్