రామాయంపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దేవలక్ష్మి అనే మహిళ తన బ్యాగులో ఉంచిన బంగారం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. అక్కన్నపేట నుంచి రామాయంపేట చేరుకుని, ఆర్మూర్ వెళ్లే మరో బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బస్సులో ప్రయాణించిన వారి బ్యాగులను తనిఖీ చేస్తూ దర్యాప్తు చేపట్టారు.