ఇళ్ల నిర్మాణదారులకు గుడ్ న్యూస్, సాండ్ బజార్ ప్రారంభం

అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 'సాండ్ బజార్'ను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే రోహిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఆయన ఈ సాండ్ బజార్‌ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మెట్రిక్ టన్నుకు రూ. 1200 చొప్పున ఇసుక అందిస్తామని, దీనికోసం 155242 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం 1100 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్