జిల్లాలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. రామాయంపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ, 40 రోజులుగా జొన్న రైతులు పంటను విక్రయించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆమె అన్నారు. పంట మార్పిడి చేసి జొన్నలు సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు.