రిజర్వేషన్ ఫలాలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి: బిక్షపతి

మెదక్ జిల్లా నిజాంపేటలో బుధవారం ఎరుకల ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ 1976లో రిజర్వేషన్ ఖరారైనప్పటికీ ఎరుకల కులస్తులకు నేటికీ దాని ఫలాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు. దామాషా ప్రకారం రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కోనేరు శ్రీను ఆధ్వర్యంలో ఎరుకల సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో జనాభా ప్రకారం ప్రయోజనాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕