హవేలీ ఘనపూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల నందు మండల విద్యాధికారి మధు మోహన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సు గురువారం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు సాగడం సంతోషమన్నారు. విద్యార్థులు ప్రాథమిక దశలోనే విద్యాజ్ఞానంతో భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు, సిఆర్పి మల్లేశం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.