నిజాంపేట మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా, చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఐసీడీసీ లక్ష్మీ విద్యార్థులకు బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్ఐ రాజేష్ పాల్గొని, చిన్న వయసులో తీసుకునే నిర్ణయాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, ఎండల తీవ్రత దృష్ట్యా బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు తెలిపారు.