ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని లేదంటే మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల రైతులతో పెద్ద ఎత్తున మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని మెదక్ జిల్లా బీఅర్ ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లు తెలిపారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.