జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని మీడియా సంఘాలు పిలుపునిచ్చాయి. మెదక్‌లో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TUWJ అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారీ, ఎలక్ట్రానిక్ మీడియా సంఘ అధ్యక్షుడు నాగరాజు, సంక్షేమ కమిటీ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు.