కన్న కూతురును పెంచే స్థోమత లేక ఓ తండ్రి కూల్ డ్రింక్లో పురుగు మందు కలిపి హత్య చేసిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ సీఐ వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామానికి చెందిన పదేళ్ల బాలికను తండ్రి శ్రీశైలం మే 31న పురుగు మందు కలిపి హత్య చేశారు. అయితే అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీశైలంను అరెస్టు చేశారు.