లారీల కొరతతో కాట్రియాల రైతుల ఆందోళన

రామాయంపేట మండలం కాట్రియాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం బస్తాలు ఇంకా అక్కడే ఉండటంతో, అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అదనపు లారీలను ఏర్పాటు చేసి, ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్