పిచ్చికుక్క దాడులు.. 9 మంది గాయాలు

నార్సింగి మండల కేంద్రంలో పిచ్చికుక్క రెండు రోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. వీధుల్లో తిరుగుతూ 9 మందిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన కలకలం రేపింది. గాయపడిన వారిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ సుజాత, ఉపసర్పంచ్ రాజేందర్ రెడ్డి బాధితులను పరామర్శించి, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు.

సంబంధిత పోస్ట్