చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చిదురుప్ప గ్రామానికి చెందిన గొల్ల నర్సింహులు అనే వ్యక్తి చిన్న గొట్టిముక్కులలోని తన అన్న ఇంటికి వచ్చి గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.