చెట్టుకు ఉరేసుకొని చిట్టీల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. స్థానిక రెడ్డి కాలనీలో నివాసముండే గంగారం శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి స్థానిక జాతీయ రహదారి పక్కన చెట్టుకు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గంగారం ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.