జిల్లాలోని 465 పంచాయతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల కోసం రూ 4. 34 కోట్ల నిధులు విడుదలైనట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన వేతనాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. పంచాయతీల అకౌంట్లో సంబంధిత వేతనాలను జమ చేస్తామని చెప్పారు.