కూలీలతో కలిసి కందకాలు తవ్విన మెదక్ జిల్లా కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధి హామీ కూలీగా మారారు. శనివారం రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూలీలతో కలిసి కందకాలు తవ్వారు. అందరికీ ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్