జిల్లాలో క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్‌ల మోజులో పడి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, కంట్రోల్ రూమ్ 8712657888కు సమాచారం అందించాలని సూచించారు.