మెదక్: బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు

మనోహరాబాద్ మండలంలో బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, బెదిరించి, లైంగిక దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసిన నిందితుడికి పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. దర్యాప్తు అనంతరం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. సోమవారం విచారణ అనంతరం, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్