రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉండాలని సూచించారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవ చేస్తానని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.