నిజాంపేటలో వైద్య శిబిరం నిర్వహణ

మెదక్ జిల్లా, నిజాంపేటలో గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స పొందేందుకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని డీజీపీఓ ఎస్పీ నర్సింహారెడ్డి సూచించారు. గురువారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని, శిబిరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సలహాలు అందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕