మెదక్: వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గడి పెద్దాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో విష జ్వరాల పరిస్థితులు ఉత్పన్నమైతే, వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్