నిజాంపేట: భూ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో శనివారం ఓ రైతు పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బుడిగె రామస్వామి (55) తన 3 ఎకరాల వ్యవసాయ భూమిని బంధువు ఒకరు తన పేరు మీద మార్చుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో రామస్వామి పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్