నిజాంపేటలో మండల సమైక్య 9వ మహాసభ మంగళవారం జరిగింది. అధ్యక్షురాలు లావణ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, సెర్ప్ ద్వారా గత ఏడాది చేపట్టిన పనులు, ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రణాళికలపై చర్చించారు. కోశాధికారి ఆడిట్ నివేదికను చదివి వినిపించారు. ఏపీఎం, సీసీ, అకౌంటెంట్తో పాటు మండలంలోని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, వీఓఏలు పాల్గొన్నారు.