హైదరాబాద్లో ఆదివారం జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వీరిలో నలుగురు స్వర్ణ పతకాలు, ఇద్దరు రజత పతకాలు సాధించారు. కరాటే మాస్టర్ సంపత్ కుమార్ శిక్షణలో విద్యార్థులు ఈ విజయం సాధించారు. గ్రాండ్ మాస్టర్ రొయ్యల హరిప్రసాద్ విద్యార్థులను అభినందించారు. ఈ విజయం నిజాంపేటకు గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు.