SIRపై అపోహలు వద్దు.. ఈసీ నిబంధనల ప్రకారమే సవరణ: ఎంపీ

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సిద్దిపేటలో మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. SIR వల్ల అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోతాయనే ప్రచారంలో నిజం లేదని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను తెలుసుకుని దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్