నర్సాపూర్ మున్సిపాలిటీ 4వార్డు నుంచి యువత ప్రతిభను ముందుకు తేవడానికి, 21 ఏళ్ల శ్రావ్య గౌడ్ BRS తరుపున కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. యువత ప్రతిభకు అవకాశాలు కల్పించడమే ఈ నామినేషన్ ముఖ్య ఉద్దేశ్యమని పార్టీ నాయకులు తెలిపారు. నామినేషన్ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శ్రావ్య గౌడ్‌కు మద్దతు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, యువతకు అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని శ్రావ్య గౌడ్ పేర్కొన్నారు.