ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఘనంగా అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు.