మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం దిశగా!

మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019లో గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనూ ఇక్కడ ఏకగ్రీవం జరిగింది. అప్పట్లో సరోజ మొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. గతంలో మల్లన్నగుట్ట తండా నుంచి సరోజ సర్పంచ్‌గా ఉండగా, ఈసారి మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్