మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో సాగునీరు విడుదల కోసం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయే అవకాశం ఉందని, వెంటనే నిరు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం రైతుల నారుమడులు కాపాడేందుకు మంజీరా నుంచి సాగునీరు విడుదల చేయాలన్నారు.