నీటి పొదుపుపై ప్రతిజ్ఞ

మెదక్ జిల్లా, నిజాంపేటలోని నందిగామలో శుక్రవారం జలజీవన్‌ మిషన్‌లో భాగంగా 'జల మహోత్సవం' నిర్వహించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించి, భావితరాలకు జల వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మిషన్‌ భగీరథ ఏఈ బిక్షపతి అన్నారు. సర్పంచ్‌ ఆకుల స్వప్న ఆధ్వర్యంలో గ్రామస్థులతో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏఈ బిక్షపతి నీటి వనరుల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ అంజిరెడ్డి, కార్యదర్శి యాదలక్ష్మి, నాయకులు ఆకుల రమేష్‌, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕