ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నివారించవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్