కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా టేక్మల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించిన నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.