రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో జరిగింది. రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. రైలు పట్టాలపై ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిగా గుర్తించారు. గత కొంతకాలంగా గుండ్ల పోచంపల్లిలో నివాసం ఉంటున్న రాజు ఇంట్లో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.