గజగట్లపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా

చిన్నశంకరంపేట మండల పరిధిలోని గజగట్లపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అర్చకుల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. మంగళవారం రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్