నార్సింగి సమస్యలపై ఎంపీకి వినతి

నార్సింగి మండల కేంద్రంలో స్థానిక సర్పంచులు, ప్రజలు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి రైల్వే బ్రిడ్జి, రహదారి సమస్యలను వివరించారు. ప్రస్తుత మార్గాల దుస్థితి వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొత్త బ్రిడ్జి, నూతన రహదారి మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎంపీ రఘునందన్ రావు సమస్యపై సానుకూలంగా స్పందించి, త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్