రామాయంపేటలో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

రామాయంపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కన్నపేట గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. కూలి పని ముగించుకుని స్వగ్రామానికి బైకుపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలంలోనే ప్రసాద్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్