ఎన్నికల నిబంధనల నేపథ్యంలో రూ.5 లక్షల నగదు సీజ్

ఎన్నికల నియమావళి అమలు నేపథ్యంలో, తూప్రాన్ సర్కిల్ సీఐ రంగకృష్ణ, ఎస్సై సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. మనోహరాబాద్ పీఎస్ పరిధిలోని కాళ్లకల్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న కూచారం గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేని రూ.5 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని తూప్రాన్ ఆర్డీవోకు అప్పగించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అక్రమ రవాణా, అనధికార నగదు ప్రవాహాన్ని నిరోధించేందుకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్