కౌడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో గురువారం చోరీ జరిగింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు షాపూర్ నుంచి గోపాల్ పేట రహీంబేగం అనే ప్రయాణికురాలు బ్యాగు నుంచి గుర్తు తెలియని దొంగలు రూ. 4. 5 లక్షల నగదు చోరీ చేశారు. కౌడిపల్లి సమీపంలోకి రాగానే చోరీ విషయాన్ని గమనించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కౌడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.